పార్టీని తిరుగులేని శక్తిగా నిలబెడతా

-క‌ష్ట‌ప‌డ్డ కార్య‌క‌ర్త‌ల‌కు గుర్తింపు
-రానున్న ఎన్నిక‌ల్లో మూడు నియోజ‌క‌వ‌ర్గాల్లో గెలుపు
-ప్ర‌భుత్వ విప్‌, జిల్లా టీఆర్ఎస్ పార్టీ అధ్య‌క్షుడు బాల్క సుమ‌న్

మంచిర్యాల : జ‌ఇల్ల జిల్లాలో పార్టీని తిరుగులేని శ‌క్తిగా నిల‌బెడ‌తా అని ప్ర‌భుత్వ విప్‌, జిల్లా టీఆర్ఎస్ పార్టీ అధ్య‌క్షుడు బాల్క సుమ‌న్ అన్నారు. ఎంఎన్ఆర్ గార్డెన్‌లో నిర్వ‌హించిన కార్య‌క‌ర్త‌ల స‌మావేశంలో ఆయ‌న పాల్గొని మాట్లాడారు. తన‌పై నమ్మకంతో మంచిర్యాల జిల్లా టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులుగా నియమించినందుకు టిఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపకుడు, ముఖ్యమంత్రి కేసీఆర్ కు, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు ధ‌న్య‌వాదాలు తెలిపారు. కార్యకర్తలే టీఆర్ఎస్ పార్టీకి బలమ‌న్నారు. మంచిర్యాల జిల్లా టిఆర్ఎస్ పార్టీ కంచుకోట అనే విష‌యాన్ని గుర్తు చేశారు. రానున్న ఎన్నికల్లో మూడు అసెంబ్లీ స్థానాలు భారీ మెజారిటీతో గెలుస్తామ‌ని స్ప‌ష్టం చేశారు. సహచర శాసనసభ్యులు, నాయకుల సహకారంతో జిల్లాలో పార్టీని మరింత బలోపేతానికి కృషి చేస్తామ‌ని వెల్ల‌డించారు. పార్టీ, ప్రభుత్వం-ప్రజలకు మధ్య వారధిగా పని చేస్తానని ఈ సంద‌ర్భంగా హామీ ఇచ్చారు.

కెసిఆర్ జ‌న్మ‌దినాన్ని పురస్కరించుకొని జిల్లాలో ప్రతి గ్రామంలో జనహిత సభలు నిర్వహించి ప్రజల వద్దనే వారి సమస్యలు పరిష్కరిస్తామ‌న్నారు. అంతేకాకుండా జిల్లాలో ప్రగతి నివేదన కార్యక్రమంతో తెరాస ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి పనులను ప్రజల్లోకి తీసుకెళ్లేలా విస్తృత ప్రచారం చేస్తామ‌ని వెల్ల‌డించారు. కర పత్రాలు, ఫ్లెక్సీలు, సోషల్ మీడియా, మీడియా సహకారంతో ప్రచారం నిర్వహిస్తామ‌న్నారు. జిల్లాలో బూత్ స్థాయి నుండి గ్రామ, పట్టణ మున్సిపల్ స్థాయిల వరకు పార్టీని మరింత బలోపేతం చేయడమే తన ముందున్న లక్ష్యమ‌ని స్ప‌ష్టం చేశారు. పార్టీ కోసం కష్టపడిన ప్రతి కార్యకర్తను కడుపున పెట్టుకొని చూసుకుంటామ‌న్నారు.

కష్టపడ్డ ప్రతీ కార్యకర్తకు గుర్తింపునిస్తామ‌ని బాల్క సుమ‌న్ వెల్ల‌డించారు. యువజన, విద్యార్థి, సోషల్ మీడియా, మహిళా విభాగాల బలోపేతానికి ప్రత్యేక దృష్టి సారిస్తామ‌ని చెప్పారు. సోషల్ మీడియా వేదిక ద్వారా ప్రభుత్వ సంక్షేమ పథకాలు మరింత విస్తృతంగా ప్రచారం చేయాల్సిన అవసరం ఉంది. దానికి అనుగుణంగా ప్రత్యేకంగా యువకులను సన్నద్ధం చేస్తామ‌ని చెప్పారు. జిల్లాలోని సమస్యలపై ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారానికి కృషి చేస్తామ‌న్నారు. త్వరలోనే పార్టీపరంగా జిల్లాలోని అన్ని కమిటీలను పూర్తిచేసి సమన్వయ సమావేశాలు నిర్వహిస్తామ‌ని చెప్పారు. అవసరమైతే శిక్షణ తరగతులను కూడా నిర్వహిస్తామ‌న్నారు.

జిల్లాలో టిఆర్ఎస్ పార్టీ తప్ప ఏ ఇతర పార్టీలు లేవన్నారు. అబద్ధాలతో, దుష్ప్రచారాలతో తమ అస్తిత్వాన్ని కాపాడుకోవాలనే విపక్షాలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని చెప్పారు. గతంలో ఉన్నత పదవులు అనుభవించిన విపక్ష నాయకులు ఈ జిల్లాకి ఒరగబెట్టింది ఏమీలేదన్నారు. టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే జిల్లాలో అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయ‌ని స్ప‌ష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి ఎంపీ వెంకటేష్ నేత, జడ్పీ ఛైర్పర్సన్ నల్లాల భాగ్య లక్ష్మి, ఎమ్మెల్యేలు నడిపల్లి దివాకర్, దుర్గం చిన్నయ్య, ఎమ్మెల్సీ దండే విఠల్ , జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రేణికుంట్ల ప్రవీణ్, మాజీ శాసనసభ్యులు నల్లాల ఓదెలు త‌దిత‌రులు పాల్గొన్నారు

Get real time updates directly on you device, subscribe now.

You might also like