భగ్గుమన్న బొగ్గుబాయి
మంచిర్యాల : సింగరేణి సంస్థ విషయంలో కేంద్రం అనుసరిస్తునన వైఖరికి నిరసనగా తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఆందోళనలు నిర్వహించారు. ఈ సందర్భంగా గనులు, ఓపెన్‌కాస్టులు, డిపార్ట్‌మెంట్లపై కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం చేశారు. మందమర్రి డివిజన్ పరిధిలోని KK5,కాసిపేట 1,2, KK 1A, KK 1, KKOCP, వర్క్ షాప్ గనులపై కేంద్ర బీజేపీ ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా పలువురు నేతలు మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబిస్తోందన్నారు. సింగరేణి బొగ్గు బ్లాక్‌ల ప్రైవేటీకరణ వెంటనే నిలిపివేయాలని కోరారు.