పాఠశాల ఎదుట తల్లిదండ్రుల ఆందోళన

తమ పిల్లలను ఫీజుల పేరిట వేధిస్తున్నారని తల్లిదండ్రులు పాఠశాల ఎదుట బైఠాయించారు. కాగజ్‌నగర్ పట్టణంలోని ఫాతిమా పాఠశాల యాజమాన్యం ఫీజుల కోసం వేధిస్తోందని ఆందోళన చేస్తున్నారు. పాఠశాల ప్రారంభమై రెండు రోజులే అయినా పరీక్షలు నిర్వహిస్తూ… ఫీజులు కట్టని పిల్లలను క్లాస్ రూము బయట నిలుచోబెట్టారని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు. తమ పిల్లల్ని పరీక్షలు రాయనివ్వలేదని చెప్పారు. ఇంటికి వచ్చిన పిల్లలు ఏడుస్తూ తల్లిదండ్రులకు తెలుపడంతో ఈ రోజు విద్యార్థుల తల్లిదండ్రులు స్కూలు ఎదుట ఆందోళన నిర్వహించారు. ఫాతిమా కాన్వెంట్ యాజమాన్యం పైన ప్రిన్సిపల్ మీద జిల్లా కలెక్టర్ కు, డీఈఓ, ఎంఈఓ కు ఫిర్యాదు చేయనున్నట్టు పలువురు విద్యార్థుల తల్లిదండ్రులు స్పష్టం చేశారు.