మత్తు పదార్థాల నియంత్రణ సామాజిక బాధ్యత
మత్తు పదార్థాల నియంత్రణ అందరి సామాజిక బాధ్యత అని శ్రీరాంపూర్ సీఐ రాజు స్పష్టం చేశారు. గురువారం శ్రీరాంపూర్ పోలీస్ స్టేషన్ ఆవరణలో కౌన్సిలర్లు, ప్రభుత్వ, ప్రైవేట్ టీచర్లు, కిరాణం, పాన్ షాప్ యజమానులు ప్రజా ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. గంజాయి మత్తుపదార్థాల నియంత్రణ పై అవగాహన సదస్సు నిర్వ హించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ గంజాయి వల్ల మత్తులో ఎంతటి నేరానికైనా తెగిస్తారని వివరించారు. గంజాయి సాగు చేసినా, నిల్వ చేసినా, సరఫరా చేసిన కేసు నమోదు చేసి జైలుకు పంపిస్తామన్నారు. ఈ విషయంలో పి.డి యాక్ట్ అమలు చేస్తామని, ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. ఇలాంటి వారి వివరాలు పోలీసులకు ఇవ్వాలని కోరారు. వారి సమాచారం గోప్యంగా ఉంచుతామని, నగదు ప్రోత్సహకాలు ఇస్తామని స్పష్టం చేశారు. రైతులు తమ వ్యవసాయ క్షేత్రాల్లో గంజాయి సాగుచేస్తే వారికి రైతుబంధు, రైతుబీమా వంటి పథకాలను నిలిపివేస్తామని సీఐ రాజు హెచ్చరించారు. గంజాయి సాగు, రవాణాను అరికడతామంటూ ప్రజా ప్రతినిదులతో, షాప్ లో యజమానులతో సీఐ గారు ప్రతిజ్ఞ చేయించారు.