అసదుద్దీన్ కు జడ్ కేటగిరీ భద్రత

ఎంఐఎం ఛీఫ్ అసదుద్దీన్ ఓవైసీకీ భద్రతపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. నిన్న అసద్ పై జరిగిన దాడిపై కేంద్ర కూడా సీరియస్ గానే రియాక్ట్ అయింది. అసదుద్దీన్ కు జడ్ కేటగరి భద్రతను కల్పించాలని నిర్ణయం తీసుకుంది. సీఆర్పీఎఫ్ బలగాలతో సెక్యూరిటీని పెంచనున్నారు. ఇది వెంటనే అమలులోకి వస్తుందని కేంద్ర హోంశాఖ ఆదేశాలు జారీ చేసింది.

నిన్న యూపీ మీరట్లో ఎన్నికల ప్రచారం ముగించుకుని ఢిల్లీకి తిరిగి వస్తున్న క్రమంలో అసదుద్దీన్ ఓవైసీపై ఇద్దరు దుండగులు కాల్పలు జరిపారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం కలిగించింది. యూపీ ఎన్నికల నేపథ్యంలో ఈ ఘటన తీవ్ర చర్చనీయాంశం అయింది. గతంలో కూడా ఢిల్లీలోని అసదుద్దీన్ ఇంటిపై కొందరు దుండగులు దాడి చేశారు. ఈ నేపథ్యంలో ఆయనకు భద్రత పెంచాలని కేంద్ర హోం శాఖ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఘటనకు పాల్పడిన ఇద్దరు వ్యక్తులను యూపీ పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేశారు

Get real time updates directly on you device, subscribe now.

You might also like