అమెరికాలో కోడి అరెస్ట్..

అనుమాన‌స్పదంగా తిరుగున్న కోడిని పోలీసులు అరెస్టు చేశారు. అది కూడా ఇక్క‌డా.. అక్క‌డా కాదు. భారీ భ‌ద్ర‌త ఉండే అమెరికా పెంట‌గాన్ ప‌రిస‌ర ప్రాంతాల్లో…

ఇంత‌కీ అస‌లు విష‌యం ఏమిటంటే…. ఏదైనా సంఘటన జరిగితే పోలీసులు విచారణ చేపట్టి.. అందుకు సంబంధించిన నిందితులను అరెస్టు చేస్తుంటారు. అలాగే అనుమానిత వ్యక్తులను పోలీసులు అరెస్టు చేస్తుంటారు. కానీ ఇక్కడ పోలీసులు ఓ కోడిని అరెస్టు చేశారు. కోడిని అరెస్టు చేయడం ఏంటని అనుకుంటున్నారా..? ఇది నిజమే. ఈ విషయం అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఈ ఘటన అమెరికాలో చోటు చేసుకుంది. అనుమానస్పందంగా తిరుగుతున్న ఓ కోడిని పెంటగాన్‌ భద్రతా అధికారులు అదుపులోకి తీసుకున్నారు. భారీ భద్రత ఉండే అమెరికా రక్షణ విభాగం పెంటగాన్ కార్యాలయ పరిసర ప్రాంతంలో ఆహారం కోసం అటూ ఇటూ తిరుగుతున్న ఓ కోడి అనుమానస్పందంగా తిరుగుతుందంటూ కొందరు పోలీసు ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. వెంటనే పోలీసులు అక్కడికి చేరుకుని కోడిని అరెస్టు చేశారు. తిండి గింజల కోసం తిరుగుతున్న కోడిని అనుమానస్పదంగా భావించి అరెస్టు చేసి తీసుకెళ్లడంపై ప‌లువురు ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేస్తున్నారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like