సింగరేణి కనుమరుగుకు కుట్ర
ఏరియా చర్చల ప్రతినిధి వెంగల కుమారస్వామి
మంచిర్యాల : కేంద్రం సింగరేణి సంస్థను కనుమరుగు చేసే కుట్ర చేస్తోందని ఏరియా చర్చల ప్రతినిధి వెంగల కుమారస్వామి ఆరోపించారు. మంచిర్యాల జిల్లా ఆర్కే 6 గనిపై రెండవ రోజు కరపత్రాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాలుగు బొగ్గు బ్లాకులను వేలంపాటలో ప్రైవేటు వారికి అప్పగించే ప్రయత్నాన్ని వెంటనే విరమించుకోవాలని డిమాండ్ చేశారు. ప్రైవేటు వారికి గనులు కేటాయించడం వలన రానున్న రోజులలో సింగరేణి కనుమరుగయ్యే అవకాశం ఉందన్నారు. కార్మికులకు అవగాహన కల్పించేందుకే కరపత్రాల పంపిణీ చేస్తున్నామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో గని పిట్ సెక్రెటరీ రాయమల్లు, అసిస్టెంట్ సెక్రెటరీ భూమయ్య, నాయకులు పొగాకు రమేష్, సంతోష్, సమ్మయ్య, అనిధర్ రెడ్డి, జయరాజు, సదానందం, మల్లయ్య కార్మికులు పాల్గొన్నారు.