వాట్సాప్​లో కేసీఆర్​పై విమర్శ.. ఆరుగురి అరెస్టు

ముఖ్య‌మంత్రిపై విమ‌ర్శ‌లు అరెస్టుల‌కు దారి తీశాయి. ముఖ్య‌మంత్రిని విమ‌ర్శిస్తూ కొంద‌రు చేసిన పోస్టుల‌కు పోలీసులు ఆరుగురు వ్య‌క్తుల‌ను అరెస్టు చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లికి చెందిన జనగంటి అర్జున్​ అనే యువకుడు ఓ వాట్సాప్​ గ్రూపులో కేసీఆర్​ను అవమానించేలా ఫొటో పోస్ట్​ చేశాడు. కారేపల్లికి చెందిన హట్కర్​ రాంబాబు అనే మరో యువకుడు ప‌లువురికి ఫార్వర్డ్​ చేశాడు. ఆ ఫొటోను చూసిన కారేపల్లి మండల టీఆర్​ఎస్​ ప్రధాన కార్యదర్శి అజ్మీర వీరన్న కారేపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. జనగంటి అర్జున్​, హట్కర్​ రాంబాబు, పొన్నెకంటి సురేశ్​, కొండమీది కోటేశ్వరావు,నేలమర్రి నారాయణ, నేలమర్రి నాగేంద్రయ్యలను అరెస్ట్​ చేశారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like