ఇంటికే అమ్మల ప్రసాదం
హైదరాబాద్ : మేడారం సమ్మక్క సారలమ్మ ప్రసాదాన్నిఆర్టీసీ,తపాలా శాఖల ద్వారా భక్తుల ఇళ్ల వద్దకు చేర్చనున్నట్లు దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. ఆర్టీసీ, తపాలా, ఐటీ శాఖల సహకారంతో డోర్ డెలివరీ చేసేలా దేవాదాయ శాఖ ఏర్పాట్లు చేస్తుందని తెలిపారు. అమ్మవారి ప్రసాదం నేరుగా పొందలేని వారికి పోస్టల్ సర్వీసు, ఆర్టీసీ కొరియర్ ద్వారా ఇంటికే చేరవేసేలా ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. ఆన్లైన్లో మీ సేవ లేదా టీయాప్ ఫోలియో (మొబైల్ ప్లే స్టోర్ డౌన్ లోడ్ చేసుకుని)లో బుక్ చేసుకోవాలన్నారు. ఈ సేవలకు ఒక ప్రసాదం ప్యాకెట్ భక్తులు రూ.225 చెల్లించాల్సి ఉంటుందన్నారు. 200 గ్రాముల బెల్లం ప్రసాదం, పసుపు కుంకుమ, అమ్మవారి ఫోటో భక్తులకు ఇంటి వద్ద అందజేస్తామన్నారు. ఫిబ్రవరి 12- 22 వరకు ఆన్లైన్లో ఇంటికే ప్రసాదం సేవలు వినియోగించుకోవాలని మంత్రి కోరారు.