గన్ మిస్ ఫైర్ హెడ్ కానిస్టేబుల్ దుర్మరణం
గన్ మిస్ ఫైర్ హెడ్ కానిస్టేబుల్ దుర్మరణం భద్రాద్రి కొత్తగూడేం జిల్లాలో చోటు చేసుకుంది. ఇల్లెందు మండలం కాచనపల్లిలో పోలీసు స్టేషన్‌లో విషాదం చోటు చేసుకుంది. పోలీసు స్టేషన్‌లో తుపాకీ మిస్‌ఫైర్ అయింది. ఈ ఘటనలో హెడ్ కానిస్టేబుల్ సంతోష్ అక్కడికక్కడే మృతి చెందారు. నైట్‌డ్యూటీలో ఉన్న సంతోష్ శనివారం తెల్లవారుజామున ఆయుధాలను పరిశీలిస్తుండగా ప్రమాదవశాత్తు ఈ ఘటన జరిగినట్లు పోలీసు అధికారులు వెల్లడించారు. మృతిచెందిన సంతోష్‌ది వరంగల్ జిల్లా గవిచర్ల. ఇల్లందు ప్రభుత్వ వైద్యశాలకు మృతదేహం తరలించారు. మూడు రోజుల కిందట కుటుంబ సభ్యులు సంతోష్‌కి పెళ్లి సంబంధం చూశారు. ఈ ఘటనతో అతని కుటుంబీకులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.