ప్రభుత్వ ఆసుపత్రి ఎదుట టీఆర్ఎస్ ఆందోళన

మంచిర్యాల : రోడ్డు ప్రమాదంలో మరణించిన వారి కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతూ టీఆర్ఎస్ నేతలు ఆందోళన నిర్వహించారు. తాగుబోతు వ్యక్తికి తన వాహనం ఇచ్చిన బీజేపీ నేత పాల్వాయి హరీషావును అరెస్టు చేయాలని, వేగంగా వాహనం నడిపి ప్రమాదానికి కారణమైన డ్రైవర్ను సైతం అరెస్టు చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ రోడ్డుపై శవాలతో బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. దామకృష్ణాపూర్ ఏరియా ఆసుపత్రి వద్ద శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో వేనస్వామి, లక్ష్మీ దంపతులు మృత్యువాతపడ్డారు. ఇన్నోవా కారు వేగంగా వచ్చి ఢీ కొట్టడంతో వారు మరణించారు. వాహనం వేగంగా ఉండటంతో స్వామి మృతదేహాన్ని ఐదారు కిలో మీటర్లు ఈడ్చుకుంటూ వెళ్లింది. ఇలా మితిమీరిన వేగంతో వాహనం నడిపిన డ్రైవరు, అతనికి వాహనం ఇచ్చిన బీజేపీ నేత పాల్వాయి హరీష్ రావును అరెస్టు చేయాలని కోరారు. ఆసుపత్రి వద్ద బంధువులతో పాటు టీఆర్ఎస్ నేతలు ఆందోళనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని, ఒక్కొక్కరికి రూ. 30 లక్షల చొప్పున మొత్తం రూ. 60 లక్షలు చెల్లించాలని డిమాండ్ చేశారు. లేకపోతే పాల్వాయి హరీష్ రావు ఇంటిని ముట్టడిస్తామని ఆయనను నియోజకవర్గంలో తిరగనివ్వమని టీఆర్ఎస్ నేతలు స్పష్టం చేశారు. గాండ్ల సమ్మయ్య, 2వ వార్డు కౌన్సిలర్ పుల్లూరి సుధాకర్, నాయకులు మూర్తీ, శివ కిరణ్ పాల్గొన్నారు.

ప్రాణాలు తీయడం బీజేపీ నేతలకు అలవాటుగా మారింది – గోగుల రవీందర్,టీఆర్ఎస్ పార్టీ మంచిర్యాల నియోజకవర్గ ఇంచార్జ్

తాగుబోతుకు బండి ఇచ్చిన బీజేపీ నేత పాల్వాయి హరీషావుకు, ఆయన డ్రైవర్పై సులు పెట్టాలి. దేశవ్యాప్తంగా ఆక్సిడెంట్లలో ప్రాణాలు తీయడం బీజేపీ నేతలకు అలవాటుగా మారింది. అక్కడ రైతులను చంపేశారు. ఇక్కడ రోడ్డు ప్రమాదంలో ఇద్దరినీ ట్టన పెట్టుకున్నారు. హరీష్ రావు ఇంటిని ముట్టడిస్తాం. ఆయనను నియోజకవర్గంలో జరగకుండా చేస్తాం. ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటేనే రేపటి రోజున మిగతా వారికి గుణపాఠంగా మారుతుంది. మనిషికి 30 లక్షల చొప్పున ఇద్దరికీ రూ. 60 లక్షలు నష్టపరిహారం చెల్లించాలి.

ప‌రామర్శకు కూడా రాలేదు – అబ్దుల్ అజీజ్, క్యాతనపల్లి టీఆర్ఎస్ పార్టీ స‌మన్వయకర్త

బీజేపీ పార్టీకి చెందిన రాష్ట్ర నాయకుడు పాల్వాయి హరీష్ రావు తన వాహనం డ్రైవర్కు ఇవ్వడం దారుణం. ఆ వాహనంలో మందుబాటిళ్లు ఉన్నాయి. చనిపోయిన దంపతులకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. వారిని ఇపుడు ఎవరు చూసుకోవాలి. కనీసం వీరిని రామర్శించేందుకు కనీసం హరీషావు రాలేదు. బీజేపీ నేతలు ఇలా ప్రవర్తించడం ౦గ్గుచేటు. బీజేపీ పార్టీ ప్రజలకు క్షమాపణలు చెప్పాలి.

Get real time updates directly on you device, subscribe now.

You might also like