ప్రధాని ఇలాకాలో.. కేసీఆర్ ఫ్లెక్సీలు
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజు అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు తెలంగాణ అంతటా సర్వం సిద్ధమయ్యింది. తమ ప్రియతమ నాయకుడి పుట్టినరోజున గురువారం ఘనంగా జరిపేందుకు టీఆర్ఎస్ శ్రేణులు సిద్దమయ్యాయి. ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగా సీఎంకు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెబుతూ భారీ కటౌట్లు,హోర్టింగ్స్ వెలిశాయి. ఈ హోర్డింగ్లు కేవలం తెలంగాణకే పరిమితం కాలేదు. ప్రధాని నరేంద్ర మోదీ సొంత రాష్ట్రం గుజరాత్ లోని సూరత్ నగరంలోనూ కేసీఆర్ పుట్టినరోజు భారీ హోర్డింగ్స్, ప్లెక్సీలు వెలిశాయి.
వారణాసిలోనూ..
ప్రధానమంత్రి నరేంద్రమోడీ నియోజకవర్గం వారణాసిలో ఈ హోర్డింగ్ లు వెలిశాయి. వారణాసికి చెందిన మృత్యుంజయ మిశ్రా అనే యువకుడు తెలంగాణ ఉద్యమ సమయంలో హైదరాబాద్లో విద్యాభ్యాసం చేశారు. ప్రస్తుతం వారణాసి లో స్థిరపడ్డ తర్వాత కూడా ముఖ్యమంత్రి కెసిఆర్ గారి పట్ల ఉన్న అపారమైన అభిమానం తో వారణాసి లోని చౌక ఘాట్, ఫాతమాన్ రోడ్డు, రథయాత్ర మరియు ప్రధాన కూడళ్ళలో హోర్డింగ్ ల ద్వారా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.