దేశ పరిశ్రమల రక్షణలో సీఐఎస్ఎఫ్ కీలకం
- యువత సీఐఎస్ఎఫ్ లో చేరాలి
- సీఐఎస్ఎఫ్ సింగరేణి కమాండెంట్ కార్తికేయన్
మంచిర్యాల : దఏ దేశ పరిశ్రమల పరిరక్షణలో సీఐఎస్ఎఫ్ ఎంతో కృషి చేస్తుందని సీఐఎస్ఎఫ్ యూనిట్ కమాండెంట్ కార్తికేయన్ అన్నారు. ఆయన శుక్రవారం మందమర్రిలోని కస్తూర్బా గాంధీ, తెలంగాణ మోడల్ స్కూల్, కళాశాలల్లో సీఐఎస్ఎఫ్ పై గురించి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఐఎస్ఎఫ్ గురించి విద్యార్థినులకు వెల్లడించారు. సీఐఎస్ఎఫ్ మహిళా ఔత్సాహికులకు అందుబాటులో ఉన్న వివిధ కెరీర్ అవకాశాలను తెలిపారు. సీఐఎస్ఎఫ్ ప్రాముఖ్యత, దేశ నిర్మాణంలో సహకారంపై అవగాహన కల్పించారు.