పోరాటాలకు సిద్ధంగా ఉండండి

ఐఎన్‌టీయూసీ కార్యకర్తలు పోరాటాలకు సిద్ధంగా ఉండాలని ఆ యూనియన్ జాతీయ అధ్యక్షుడు జీ.సంజీవరెడ్డి పిలుపునిచ్చారు. హైదరాబాద్‌లోని ఆర్టీసీ కళ్యాణమండపంలో సంజీవరెడ్డి జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మట్లాడుతూ దేశంలో మోడీ నిరంకుశ విధానాల వలన ప్రభుత్వ రంగ సంస్థలు నిర్వీర్యం అవుతున్నాయన్నారు. బీజేపీ ప్రభుత్వ కొమ్ములు వంచడానికి, ఆ పార్టీని గద్దె దింపడమే లక్ష్యంగా ఐఎన్‌టీయూసీ శ్రేణులు పోరాటాలు చేయాలని పిలుపునిచ్చారు. ఐఎన్‌టీయూసీ సెక్రెటరీ జనరల్ జనక్ ప్రసాద్ మాట్లాడుతూ ప్రధాని మోడీ దేశాన్ని గుజరాతీల చేతుల్లో పెట్టారని దుయ్యబట్టారు. అదానీ, అంబానీలకు అమ్మాలని చూస్తున్నడని దుయ్యబట్టారు. మోడీ, కేసీఆర్ కలిసి సింగరేణిని ప్రైవేటీకరణ చేయాలని చూస్తున్నారని అన్నారు. మాజీ MP హన్మంతరావు మాట్లాడుతూ ప్రపంచంలోనే సంజీవ రెడ్డి లాంటి శక్తివంతమైన కార్మిక నేత లేడన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఐఎన్‌టీయూసీకి ప్రాధాన్యం కల్పించాలన్నారు. కార్యక్రమంలో కేంద్ర కమిటీ సీనియర్ ఉపాధ్యక్షులు S.నర్సింహారెడ్డి,సిద్దంశెట్టి రాజమౌళి, కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శులు పీ. ధర్మపురి, కంపెళ్లి సమ్మయ్య, కేంద్ర కమిటీ ఉపాధ్యక్షులు P.రాజేందర్, J. శంకర్రావు, కేంద్ర కమిటీ చీఫ్ ఆర్గనైజింగ్ సెక్రెటరీ రాంశెట్టి నరేందర్, కేంద్ర కమిటీ నాయకులు భీంరావు, గరిగ స్వామి, మందమర్రి ఏరియా నుండి ఐఎన్‌టీయూసీ మందమర్రి ఏరియా ఉపాధ్యక్షుడు దేవి భూమయ్య, బెల్లంపల్లి ఏరియా ఉపాధ్యక్షుడు పేరం శ్రీనివాస్, తేజవత్ రాంబాబు, ఏరియా కార్యదర్శి దొరిశెట్టి చంద్రశేఖర్ పాల్గొన్నారు.
జన్మదిన శుభాకాంక్షలు చెప్పిన ఆర్జీ 3 ఏరియా నేతలు..
ఐఎన్‌టీయూసీ జాతీయ అధ్యక్షుడు జీ.సంజీవరెడ్డి జన్మదినం సందర్భంగా ఆర్జీ 3 ఏరియా ఐఎన్‌టీయూసీ నేతలు భారీగా తరలివెళ్లారు. ఈ సందర్భంగా ఆయనను కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో ఆర్జీ 3 ఏరియా ఉపాధ్యక్షుడు కోట రవీందర్‌రెడ్డి, మడ్డి రాజ్‌కుమార్, ఉయ్యాల కుమార్ స్వామి, రాళ్లబండి రవీందర్, శ్రీనివాసాచారి, మందల కొమురయ్య తదితరులు పాల్గొన్నారు.