కాంగ్రెస్ పార్టీకి రాం..రాం..
-పార్టీలో పరిణామాలపై జగ్గారెడ్డి ఆగ్రహం
-ఇవ్వాళ మీడియా సమావేశంలో వివరాల వెల్లడి

ఎమ్మెల్యే తూర్పు జయప్రకాశ్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి గుడ్‌బై చెప్పనున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే తన అనుచరులకు సమాచారం చేరవేశారు. కొంత కాలంగా జగ్గారెడ్డి టీఆర్ఎస్ లో చేరబోతు న్నట్టు ఊహాగానాలు వస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆయన కాంగ్రెస్ పార్టీ వీడటం ప్రాధాన్యత సంతరించుకుంది. జగ్గారెడ్డి ప్రస్తుతం టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా కొనసాగుతున్నారు. రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ గా నియామకం తర్వాత పార్టీ కార్యక్రమాలకు జగ్గారెడ్డి కాస్త దూరంగానే ఉంటున్నారు. రేవంత్ నియామ కాన్ని మీడియా ఎదుటే వ్యతిరేకించారు. టీఆర్ఎస్ కు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని సొంత పార్టీ నేతల నుంచి జగ్గారెడ్డిపై ఆరోపణలు వస్తున్నాయి. ఈ కారణంగానే ఆయన పార్టీని వీడాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది..
మూడు రోజుల కిందట కేటీఆర్ పర్యటనలో ఆయనతో చాలా సన్నిహితంగా వ్యవహరించారు. దీంతో సొంత పార్టీ నేతలే ఆరోపణలు చేశారు. దీంతో ఆయన పార్టీ వీడాలని నిర్ణయం తీసుకున్నారు. పార్టీ కోసం ఎంత చేసినా గుర్తింపు లేకుండా పోతున్నదని తన సన్నిహి తుల వద్ద ఆవేదన వ్యక్తం చేస్తున్నారని తెలుస్తోంది. ఉమ్మడి మెదక్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన ఎకైక ఎమ్మెల్యే జగ్గారెడ్డి. రాష్ట్ర వ్యాప్తంగా టీఆర్ఎస్ హవాను తట్టుకొని విజయం సాధించిన కాంగ్రెస్ ముఖ్య నాయకుల్లో ఆయన ఒకరు. పార్టీలో జరుగు తున్న పరిణామాలను దృష్టిలో ఉంచుకుని పార్టీకి ఎలాంటి నష్టం జరగవద్దనే ఉద్దేశంతోనే ఆయన పార్టీని వీడాలని నిర్ణయం తీసుకున్నారు.
అయితే ఆయన కాంగ్రెస్ వీడినా టీఆర్ఎస్‌లో చేరనని చెబుతున్నారు. పార్టీలో జరుగుతున్న పరిణామాలు.. తదితర విషయాలను మీడియాకు శనివారం వెల్ల డిస్తానని స్పష్టం చేశారు. కాంగ్రెస్ను వీడుతున్నప్పటికీ టీఆర్ఎస్లో చేరే ప్రసక్తే లేదని చెప్పారు. ప్రస్తుతానికి స్వతంత్రంగానే కొనసాగుతానని నేతలకు చెబుతున్నట్లు సమాచారం. టీఆర్ఎస్ లో చేరాలని అనుకుంటే.. అందుకు బదులుగా కాంగ్రెస్‌లోనే ఉంటానని స్పష్టం చేసినట్లు తెలుస్తోంది.