దేశ ప్రజలు మార్పు కోరుకుంటున్నారు
-ప్రాంతీయ పార్టీలు ఏకతాటిపైకి రావాలి
-ఇది గొప్ప శుభారంభం
-తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్
దేశ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, ప్రాంతీయ పార్టీలు ఏకతాటిపైకి రావాల్సిన సమయం ఆసన్నమైందని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. ముంబై పర్యటనలో భాగంగా మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రేతో సమావేశం ముగిసిన అనంతరం సీఎం కేసీఆర్ మీడియాతో మాట్లాడారు. దేశ రాజకీయాలపై చర్చించేందుకే మహారాష్ట్రకు వచ్చానని కేసీఆర్ స్పష్టం చేశారు. దేశంలో గుణాత్మక మార్పు రావాలని తెలిపారు. మహారాష్ట్ర నుంచే ఆ ప్రయత్నాలు మొదలయ్యాయన్నారు. ఇది గొప్ప శుభా రంభమని అభిప్రాయపడ్డారు. త్వరలోనే అన్ని పార్టీల అధినేతలతో హైదరాబాద్ లేదా మరోచోట సమావేశం ఏర్పాటు చేస్తామన్నారు. కేంద్ర ప్రభుత్వం తన ఆధీనంలో ఉన్న దర్యాప్తు సంస్థలను స్వప్రయోజనాలకు వాడుకుం టోందని ఆరోపించారు.
చాలా కాలంగా కేసీఆర్తో కలవాలని అనుకున్నానని, చివరకు ఇప్పుడు సాకారమైందని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే అన్నారు. ప్రతీకార రాజకీయాలకు పాల్పడాలని హిందుత్వలో ఎక్కడా లేదని వ్యాఖ్యానించారు.