ప్రజలపై భారం తగ్గించాలి
టీపీసీసీ సెక్రటరీ మత్తమారి సూరిబాబు
మంచిర్యాల : డెవలప్మెంట్ చార్జీల పేరిట పేదలను దోచుకునే రాష్ట్ర ప్రభుత్వ వైఖరి మానుకోవాలని టీపీసీసీ సెక్రటరీ మత్తమారి సూరిబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం పెంచిన డెవలప్మెంట్ చార్జీలకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా సూరిబాబు మాట్లాడుతూ అధిక ఛార్జీలతో ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. వెంటనే అదనపు విద్యుత్ ఛార్జీలను తగ్గించాలని ప్రజల పక్షాన కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోందన్నారు. ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు ప్రజలకు అనేక వాగ్దానాలు చేసి, ఒక్కటి కూడా నెరవేర్చలేదన్నారు. అదనంగా ప్రజలపై కరెంటు బిల్లులు వేయడం అన్యాయం, అక్రమని ఆందోళన వ్యక్తం చేశారు. బడుగు, బలహీన వర్గాలు, సామాన్య పేద ప్రజలు మీరు విధించే విద్యుత్ ఛార్జీలు కట్టలేని పరిస్థితి దాపురించిందన్నారు..
భారీగా బైక్ ర్యాలీ…
కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుంచి బైక్ ర్యాలీతో మెయిన్ బజార్ రోడ్ నుంచి ఏఎంసి, కాల్టెక్స్ ,సబ్ స్టేషన్ విద్యుత్ కార్యాలయం వరకు బైకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం బెల్లంపల్లి విద్యుత్ డీఈకి వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో పట్టణ మాజీ అధ్యక్షుడు ముచ్చర్ల మల్లయ్య, ఉమ్మడి జిల్లా ప్రధాన కార్యదర్శి గెల్లి జయరాం యాదవ్, బ్లాక్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు సిలీవేరి సత్యనారాయణ, దేవసాని ఆనంద్, ఎస్సీ సెల్ స్టేట్ సెక్రటరీ మల్లారపు చినరాజం, ఎస్సీ సెల్ జిల్లా ఉపాధ్యక్షుడు మంతెన కొమురయ్య, ఎంపీపీ మల్లేష్, ఎస్సీ సెల్ జిల్లా జనరల్ సెక్రెటరీ మేకల శ్రీనివాస్, ఎన్ ఎస్ యు ఐ జిల్లా వైస్ ప్రెసిడెంట్ వినయ్ సోడాయి తదితరులు పాల్గొన్నారు.