నిధులు మంజూరు చేయండి
మంచిర్యాల : చెన్నూరు నియోజకవర్గంలో రోడ్ల నిర్మాణానికి సంబంధించి నిధులు మంజూరు చేయాలని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ విజ్ఞప్తి చేశారు. మంగళవారం ఆయన పంచాయతీరాజ్ శాఖ మాత్యులు ఎర్రబెల్లి దయాకర్ రావుని కలిసి నియోజకవర్గంలో ఉన్న రోడ్లకు నిధులు ఇవ్వాలని కోరారు. ముఖ్యంగా చెన్నూరు మండలం అంగ్రాజ్ పల్లి నుంచి ముత్తరావ్ పల్లి వరకు అక్కడి నుండి అన్నారం బ్యారేజీ జంక్షన్ వరకు నూతన రోడ్డు నిర్మాణం కోసం రూ. 6.08 కోట్ల రూపాయల నిధులు అందించాలన్నారు. ఈ సందర్భంగా మంత్రికి బాల్క సుమన్ వినతిపత్రం అందించారు.