వాట్సప్‌కు ఆదాయం ఎలా వస్తుందంటే..?
వాట్సాప్.. ఇప్పుడు ఎవరి స్మార్ట్ ఫోన్లో చూసినా వాట్సాప్ కచ్చితంగా ఉంటుంది. బ్రెయిన్ ఆక్టాన్, జాన్ కౌమ్ అనే ఇద్దరు కలిసి 2009లో ఈ వాట్సాప్‌ను డెవలప్ చేశారు. అంతకు ముందు మెసేజ్ చేయాలంటే చార్జీలు ఉండేవి. వాట్సప్‌ను మాత్రం ఇంటర్నెట్ ఆధారంగా మెసేజ్‌లు పంపేలా దీన్ని డెవలప్ చేశారు. అయితే మొదటి ఏడాది దీన్ని ఫ్రీగా వాడేలా రూపొందించినా.. ఆ తర్వాత నుంచి మాత్రం సంవత్సరానికి ఒక డాలర్‌ను చార్జ్ చేసేవారు.
కాగా ఫేస్బుక్ దీనికి పోటీగా మెసేంజర్ యాప్‌ను తీసుకు వచ్చింది. ఇది అంత ఫేమస్ కాకపోవడంతో.. చివరకు వాట్సాప్‌ను కొనుగోలు చేసింది ఫేస్బుక్. అయితే ఫేస్ బుక్ కొన్న తర్వాత ఆ డాలర్ చార్జ్‌ను కూడా ఎత్తేసింది. దాంతో ఇది ఫ్రీ యాప్ అయిపోయింది. వాట్సాప్‌కు ఆదాయం పెద్ద ఎత్తున వస్తోంది. అయితే అది మన దగ్గరి నుంచి కాదు.
ఈ వాట్సాప్‌ను ఇన్ స్టాల్ చేసుకునే క్రమంలో.. మన పర్సనల్ ఇన్ఫర్మేషన్ను ఫేస్‌బుక్‌తో పంచుకునేందుకు ఒక పాయింట్‌ను ఆడ్ చేసింది. అందుకే మన వాట్సాప్ లో ఉండే లొకేషన్, ఫోన్ నెంబర్, ఇతర అడ్రస్ లాంటి సమాచారాన్ని ఫేస్‌బుక్‌కు చేరవేస్తుంది వాట్సాప్. వాట్సాఫ్ ద్వారా ఫేస్ బుక్ పర్సనల్ ఇన్ఫర్మేషన్ను ఉంచుకుని బిజినెస్ చేసుకుంటోంది. అలా కంపెనీల నుంచి ఎక్కువ యాడ్స్ సంపాదిస్తోంది ఫేస్బుక్.
ఇప్పటికే ఫేస్ బుక్ పర్సనల్ ఇన్ఫర్మేషన్ను అమ్ముకుంటుందనే ఆరోపణలు కూడా ఉన్నాయి. అయితే వాట్సాప్‌కు మరో ముఖ్యమైన ఆదాయ మార్గం ఏపీఐ. ఇది వాట్సాప్ ద్వారా కంపెనీలు యూజర్లకు దగ్గరగా ఉండేందుకు మీడియేటర్ లాగా పనిచేస్తుంది. దీని ద్వారా కస్టమర్లు మెసేజ్ చేసిన 24గంటలలోపు కంపెనీలు రిప్లై ఇస్తే ఎలాంటి ఫీజు ఉండదు. కానీ ఆ తర్వాత మెసేజ్ చేస్తే మాత్రం ప్రతి మెసేజ్‌కు రూ.30పైసల దాకా చార్జ్ చేస్తున్నారు.
ఇక ఇప్పటికే బిజినెస్ వాట్సాప్‌ను తీసుకు వచ్చింది. ఇక త్వరలోనే వాట్సాప్ స్టేటస్ మధ్యలో యాడ్స్‌ను ప్లే చేసేందుకు కూడా ప్లాన్ చేస్తోందంట వాట్సాప్. అయితే ఇందుకు సంబంధించిన వివరాలు పూర్తిగా తెలియరాలేదు. కాగా ఇప్పటి వరకు అయితే ఏపీఐ ద్వారానే అత్యధికంగా ఆదాయం వస్తోంది వాట్సాప్‌కు.