గిరిజన కుటుంబాలకు అండగా ఉంటా..

-ఆదివాసి, గిరిజన కుటుంబాలు అన్నీ రంగాల్లో ముందుండాలన్నదే తెరాస పార్టీ లక్ష్యం
-కోయగూడలో 12 బావుల కోసం ఎమ్మెల్యే భూమిపూజ
-విధ్యుత్ మోటార్లు అందిస్తానని రైతులకు హామీ
-వెంటనే కరెంట్ కనెక్షన్లు ఇవ్వాలని విద్యుత్ అధికారులకు ఎమ్మెల్యే ఆదేశాలు

కాగ‌జ్‌న‌గ‌ర్ : గిరిజ‌న కుటుంబాల‌కు అండ‌గా ఉంటామ‌ని సిర్పూరు ఎమ్మెల్యే కోనేరు కోన‌ప్ప హామీ ఇచ్చారు. బుధ‌వారం ఆయ‌న కోయ‌గూడ‌లో 12 బావుల‌కు భూమి పూజ చేశారు. గిరిజన రైతులను సాగుదిశగా ప్రోత్సహించడమే టీఆర్ఎస్ ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. కౌటాల మండలంలోని గురుడుపేట గ్రామ పంచాయతీ పరిధిలోని కోయగూడ(జి) గ్రామంలో ఈ బావుల‌ను భూమి పూజ చేశారు. ఎన్నో ఏండ్లుగా వ్యవసాయం చేయక బీడు భూములుగా మారిన పొలాలను సాగు భూములుగా మార్చేందుకు ఎమ్మెల్యే , స్థానిక టిఆర్ఎస్ పార్టీ నాయకులు సన్నద్దమయ్యారు. దాని భాగంగా గిరిజ‌నుల భూముల్లో పంట‌ల సాగు కోసం బావులు త‌వ్విస్తున్నారు. అదే స‌మ‌యంలో త‌వ్వించిన బావుల‌కు ఉచితంగా మోటార్లు కూడా ఏర్పాటు చేయ‌నున్నారు. రైతుల పొలాలకు వెంటనే విద్యుత్ కనెక్షన్లు ఇవ్వాలని విద్యుత్ అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like