ఏబీకేఎంఎస్ జాతీయ కార్యదర్శిగా మాధవ్నాయక్
మంచిర్యాల: అఖిల్ భారతీ ఖదాన్ మజ్దూర్ సంఘ్ జాతీయ కార్యదర్శిగా బీఎంఎస్ నేత పి.మాధవ్ నాయక్ ఎన్నికయ్యారు. నాగ్ పూర్లో అఖిల్ భారతీ ఖదాన్ మజ్దూర్ సంఘ్ (ఏబీకేఎంఎస్-బీఎంఎస్) 18వ త్రైమాసిక మహాసభ నిర్వహించారు. ఈ సమావేశంలో జాతీయ కమిటీలను ఎన్నుకున్నారు. బీఎంఎస్ జాతీయ బొగ్గు గనుల ఇన్చార్జీ కొత్తకాపు లక్ష్మారెడ్డి నూతన ఏబీకేఎంఎస్ జాతీయ కమిటీని ప్రకటించారు. టికేశ్వర్ రాథోడ్ అధ్యక్షుడిగా, సుధీర్ గుర్డే జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు. కోల్మైన్స్ కార్మిక్ సంఘ్ ప్రధాన కార్యదర్శి, జేబీసీసీఐ సంఢ్యులు పి.మాధవనాయక్ను జాతీయ కార్యదర్శిగా ఎన్నుకున్నారు. ఆయన ఎన్నిక పట్ల పలువురు నేతలు ఆనందం వ్యక్తం చేశారు.