ఫ్లాష్.. ఫ్లాష్.. రోడ్డు ప్రమాదంలో ఎస్ఐ మృతి
రోడ్డు ప్రమాదంలో ఒక ఎస్ఐ మృతి చెందారు. రంగారెడ్డి జిల్లా ఓఆర్ఆర్పై రోడ్డు ప్రమాదం సంభవించింది. శంషాబాద్ నుంచి తుక్కుగూడ వైపు వెళ్తుండగా సిమెంట్ లోడ్‌తో వెళ్తున్న లారీని కారు ఢీ కొట్టింది. దీంతో అందులో ప్రయాణిస్తున్న సబ్ ఇన్స్పెక్టర్ పల్లె రాఘవేందర్ గౌడ్ అక్కడికక్కడే మరణించారు. ఆయన మహబూబ్‌నగర్ లో రైల్వే పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్నారు. ఈ మేరకు పహాడీషరీఫ్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.