పైప్లైన్ పగిలి.. ఉవ్వెత్తున ఎగిసి..
మంచిర్యాల : మంచిర్యాల ముల్కల వద్ద మిషన్ భగీరథ పైప్లైన్ పగలడంతో పెద్ద ఎత్తున నీళ్లు ఎగిసిపడుతున్నాయి. సోమవారం ఉదయం ముల్కల పుష్కరఘాట్ వద్ద మెయిన్ రోడ్డు పక్కన ఉన్న ఈ పైప్లైన్ పగిలిపోయింది. దీంతో నీళ్లు దాదాపు 30 నుంచి 40 మీటర్ల ఎత్తుకు పెద్ద ఎత్తున ఎగిసిపడుతున్నాయి. ఫొటోలో చూస్తూ మాత్రం ఆ నీళ్లు ఆకాశంలో మబ్బు తునకలాగా అగుపించడం గమనార్హం.