అర్హులైన వారందరికీ దళిత బంధు అందించాలి
బిజెపి జిల్లా అధ్యక్షుడు వెరబెల్లి రఘునాథ్
అర్హులైన వారందరికీ దళిత బంధు అందించాలని బిజెపి జిల్లా అధ్యక్షుడు వెరబెల్లి రఘునాథ్ డిమాండ్ చేశారు. జిల్లా జాయింట్ కలెక్టరు మధుసూధన్ నాయక్ కు బీజేపీ ఆధ్వర్యంలో వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా రఘునాథ్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎమ్మెల్యే ద్వారా ఎంపిక చేసిన లబ్ధిదారులకు మాత్రమే దళితబంధుకు ఎంపిక చేయడం దారుణం అన్నారు. ఈ పథకంలో రాజకీయ జోక్యం చేసుకోవడం తో నిజమైన అర్హులకు దళితబంధు అందడం లేదన్నారు. కేవలం అధికార పార్టీ నాయకులు, కార్యకర్తలను మాత్రమే ఎంపిక చేయడంతో అసలైన వారికి ఈ పథకం చేరడం లేదన్నారు. దళిత బంధు నియోజకవర్గంలో 100 మందికే కాకుండా ప్రతి ఒక్క దళితులకి అందించాలన్నారు. దళిత బంధు అందించడంలో ఎలాంటి రాజకీయ జోక్యం లేకుండా చూడాలన్నారు.
ఈ కార్యక్రమంలో అందుగుల శ్రీనివాస్,కొయ్యలఏమాజీ,అరుమూల్లపొషం,సప్పిడినరేష్, పత్తిశ్రీనివాస్, జోగులశ్రీదేవి, బోద్దునమల్లేష్, వంగపల్లి వెంకటేశ్వర్ రావు, పైడిమల్ల నర్సింగ్, ముదాంమల్లేష్, బొడకుంటప్రభ, డీవీదీక్షితులు, గాజులప్రభాకర్, బోయిని లలిత, అర్ణకొండ శ్రీనివాస్, రాచకొండ సత్యనారాయణ, బోయిని దేవేందర్, పల్లి రాకేష్, వివేక్, శ్రీవాస్తవ, గట్ల దయాకర్, జాడి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.