బీఎంఎస్ భూపాలపల్లి ఏరియా కమిటీ ఎన్నిక
భారతీయ మజ్దూర్ సంఘ్ భూపాలపల్లి ఏరియా కమిటీని సోమవారం ఎన్నుకున్నారు. భూపాలపల్లిలో సాయంత్రం జరిగిన సమావేశంలో ఈ ఎన్నిక జరిగింది. ఉపాధ్యక్షుడిగా అప్పని శ్రీనివాస్ ఎన్నికయ్యారు. కార్యదర్శిగా సుజిందర్, ఆర్గనైజింగ్ సెక్రటరీలుగా బోయిన వెంకటస్వామి, కడారి శంకర్, అటుకుల రాజిరెడ్డి, జాయింట్ సెక్రటరీలుగా శ్రీరాముల సాంబయ్య, రేణికుంట్ల మల్లేష్, రఘుపతి రెడ్డి, కేటీకే 1 ఇంక్లైన్ పిట్ సెక్రటరీగా ఓరం లక్ష్మాణ్, కేటీకే 5 ఇంక్లైన్ పిట్ సెక్రటరీగా ఫణి రమేష్, కేటీకే 6 ఇంక్లైన్ పిట్ సెక్రటరీగా రంగనాయకుల జనార్దన్, కేటీకే 8 ఇంక్లైన్ పిట్ సెక్రటరీగా ఎండీ. యూసుఫ్, కేటీకే ఓసీ 2 పిట్ సెక్రటరీగా దామోదర్ రావు, కేటీకే ఓసీ 3 పిట్ సెక్రటరీగా కే.మల్లేష్, ఎస్అండ్పీసీ పిట్ సెక్రటరీగా ఈదుల శ్రీనివాస్ ఎంపికయ్యారు.