పండుగ పూట విషాదం.. ఇద్దరి మృతి
-సాన్నానికి వెళ్లి గల్లంతైన తల్లి,కొడుకు
-శవాలను వెలికితీసిన జాలరులు
మహాశివరాత్రి పర్వదినాన స్నానాలకు వెళ్లిన తల్లి,కొడుకు మృతి చెందిన ఘటన సిర్పూర్(టి) మండలంలో చోటు చేసుకుంది. కొమురం బీమ్ ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ (టీ) కి చెందిన పద్మ, రక్షిత్, మంగ పెన్ గంగానదిలో పుణ్య స్నానాలు కోసం వెళ్లారు. ఇందులో ఎరుకొండ పద్మ, రక్షిత్ తల్లి కొడుకు కాగా, మంగ పద్మకు చెల్లెలు అవుతుంది. లోతు ఎక్కువగా ఉండటంతో ముగ్గురు గల్లంతయ్యారు. దీనిని గమనించిన 108 సిబ్బంది సుభాష్ మంగను మాత్రం కాపాడగలిగారు. మిగతా ఇద్దరూ నదిలో గల్లంతయ్యారు. సమాచారం అందుకున్న కౌటాల సీఐ బుద్దెస్వామి, ఎస్ఐ రవీందర్ ఘటనా స్థలానికి చేరుకుని గజ ఈతగాళ్లతో గాలింపు చర్యలు చేపట్టారు. జాలరుల వలలకు చిక్కుకోవడంతో ఇద్దరి శవాలను బయటకు తీశారు. పండగ పూట ఆ కుటుంబంలో విషాదం నెలకొంది.