రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి
-మంచిర్యాల జిల్లా జైపూర్ వద్ద ప్రమాదం
-వేలాల జాతరకు వెళ్తుండగా లారీని ఢీ కొట్టిన కారు
మంచిర్యాల : వేలాల జాతరకు వెళ్లాలని మిత్రులు నిర్ణయం తీసుకున్నారు. నలుగురు కలిసి జాతరకు బయల్దేరారు. ఇంతలోనే వారిని మృత్యువు కబళించింది. ఇద్దరు స్నేహితులు మరణించడంతో బూర్గుపల్లిలో విషాదఛాయలు అలుముకున్నాయి..
మంచిర్యాల జిల్లా భీమారం మండలం బూరుగుపల్లికి చెందిన నలుగురు మిత్రులు వేలాల జాతరకు బయల్దేరారు. ఇందులో ధరావత్ రవి నాయక్ (26), భూక్య రాజేష్ నాయక్ ,భూక్య చిరంజీవి, మరో వ్యక్తి కలిసి బయల్దేరారు. భీమారం మీదుగా మంచిర్యాల – చెన్నూర్ జాతీయ రహదారిపై ప్రయాణిస్తున్నారు. జైపూర్ హైవే లోని స్థానిక సమ్మక్క – సారక్క గుడి దాటినా తర్వాత చెన్నూర్ వైపునకు వెళ్తున్న ఇసుక లారీ ఏపీ 15టీఏ 1934 లారీ తప్పించ బోయారు. అయినా కారు లారీని ఢీకొట్టింది. వాహనాన్ని నడిపిస్తున్న రవి, భూక్య చిరంజీవి తీవ్రంగా గాయపడ్డారు. కారులో ఇరుకున్న రవిని, చిరంజీవిని శ్రమించి బయటకు తీసి ఆసుపత్రికి తరలించే లోపే వారు మరణించారని స్థానికులు తెలిపారు.
ఈ ప్రమాదంలో కారు నుజ్జునుజ్జు అయ్యింది. ఇంజన్ లోని భాగాలు చెల్లాచెదురుగా పడ్డాయి. కారు తుక్కు తుక్కు కాగా లారీ ముందు భాగం డ్యామేజ్ అయింది. భూక్య రాజేష్ నాయక్ కాలుతో పాటు మరి కొన్ని చోట్ల తీవ్ర గాయాలు కాగా , మరో ధరావత్ రవికి సైతం తీవ్ర గాయాలు అయ్యాయి. వీరంతా ఒకే గ్రామానికి చెందిన వారు. కాగా బూర్గుపల్లి లో విషాద ఛాయలు అలుముకున్నాయు. కాగా వీరిని తలిస్తున్న 108 కు మంచిర్యాల ఓవర్ బ్రిడ్జి పైనా పంచర్ కాగా మరో వాహనo లో వారిని తరలించారు. మాజీ జెడ్పీటీసీ జర్పుల రాజ్ కుమార్ నాయక్, భీమారానికి చెందిన యువకులు వారిని మంచిర్యాల కు తరలించారు.