ఓదార్చి.. ధైర్యం చెప్పి…

మంచిర్యాల : రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కుటుంబాలను పరామర్శించిన ప్రభుత్వ విప్ బాల్క సుమన్, ప్రమాదంలో గాయపడ్డ వారికి ధైర్యం చెప్పారు. జైపూర్ మండలం వెలిశాల మల్లన్న ఆలయం సమీపంలో జరిగిన యాక్సిడెంట్ లో ఇద్దరు మృతి చెందారు. ఈ ప్రమాదంలో భీమారం మండలం బూరుగుపల్లి గ్రామ అధ్యక్షుడు రవి, చిరంజీవి చనిపోయారు. వారి మృతి పట్ల మంచిర్యాల జిల్లా టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, ప్రభుత్వ విప్ బాల్క సుమన్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ దవాఖానలో వారి మృత దేహాలను పరిశీలించి కుటుంబ సభ్యులను ఓదార్చారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.
ఇదే ప్రమాదంలో తీవ్ర గాయాలై చికిత్స పొందుతున్న భీమారం మండలం టిఆర్ఎస్ నాయకులు రవి, రాజేష్ ను మంచిర్యాల పట్టణంలోని ప్రైవేట్ హాస్పటల్లో పరామర్శించిన బాల్క సుమన్ జరిగిన సంఘటన పై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. బాధితులు త్వరగా కోలుకోవాలని ఆశాభావం వ్యక్తం చేశారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు.