స్కూల్‌లో కొట్టుకున్న విద్యార్థులు, ఒక స్టూడెంట్ మృతి
ఒక పాఠశాలలో జరిగిన ఘర్షణ విద్యార్థి మృతికి దారి తీసింది. హైదరాబాద్‌లోని కృష్ణా నగర్‌లో దారుణం జరిగింది. ఓ ప్రైవేట్ స్కూల్‌లోని విద్యార్థుల మధ్య జరిగిన ఘర్షణ ఓ నిండు ప్రాణం బలి తీసుకుంది. సాయికృప స్కూల్‌లో విద్యార్థుల మధ్య గొడవ జరిగింది. మాటా మాట పెరిగి ఆ వివాదం కాస్తా ముదిరింది. ఇద్దర విద్యార్థులు కొట్టుకున్నారు. పదో తరగతి చదువుతున్న విద్యార్థులు ఘర్షణ పడ్డారు. ఈ కొట్లాటో మన్సూర్ అనే విద్యార్థి తీవ్రంగా గాయపడ్డాడు. తీవ్ర గాయాలైన మన్సూర్‌ను ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలోనే మృతి చెందాడు.