రూ. 1.10 కోట్లు..
-భారతీయులను తరలించేందుకు విమానం ఖర్చు
-ఉచితంగానే తరలిస్తున్న కేంద్ర ప్రభుత్వం
ఉక్రెయిన్ యుద్దం నేపథ్యంలో అక్కడి విద్యార్థులను తరలించే ప్రక్రియను కేంద్ర ప్రభుత్వం వేగవంతం చేసింది. ఇప్పటి వరకు … మంది భారతీయులను తరలించినట్లు అధికారులు చెబుతున్నారు. ఈ తరలింపు ప్రక్రియలో ఒక్కో విమానం ఉక్రేయిన్ వెళ్లి తిరిగి విద్యార్థులను తీసుకురావడానికి రూ. 1.10 కోట్లు ఖర్చు చేస్తున్నారు. ఈ మేరకు ఎయిర్ ఇండియా ప్రత్యేక విమానాలు నడుపుతోంది. విమానం కోసం రూ. 7 నుంచి రూ. 8 లక్షల వరకు ఖర్చవుతుంది. విమానం సిబ్బంది, ఇంధనం, నావిగేషన్, పార్కింగ్ కోసం ఈ ఖర్చు చేస్తున్నారు. ఈ ప్రయాణానికి అయ్యే ఖర్చు ప్రజల నుంచి వసూలు చేయడం లేదు. కేంద్రం భరిస్తోంది. అక్కడి విద్యార్థులను తరలించేందుకు ఎయిర్ఫోర్స్ ను రంగంలోకి దించిన మోదీ ప్రభుత్వం సీ 17 విమానాన్ని పంపింది. అదే సమయంలో రెండు రోజుల్లో మరో 15 ఫ్లైట్ పంపించి అక్కడ ఉన్న వారందరినీ సురక్షితంగా వెనక్కి తీసుకువచ్చేలా ప్రణాళికలు రూపొందించారు.