మంచిర్యాల ఎమ్మెల్యే ఇంటి ముట్టడి
మంచిర్యాల : మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు ఇంటిని కాంగ్రెస్ మహిళలు ముట్టడించారు. జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖపై ఎమ్మెల్యే కొడుకు విజిత్ రావు అనుచిత వ్యాఖ్యలు చేశారని నిరసిస్తూ మహిళలు ఇంటిని మట్టడించారు.ఆయన ఇంట్లోకి చొచ్చుకువెళ్లారు. దీంతో అక్కడ ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. పోలీసులు అక్కడికి చేరుకుని పరిస్థితి అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు.