భౌతిక దాడులు సరికాదు..
మంచిర్యాల జిల్లా టిఆర్ఎస్ అధ్యక్షులు, ప్రభుత్వ విప్ బాల్క సుమన్
ప్రజాస్వామ్యంలో భౌతిక దాడులకు తావులేదని మంచిర్యాల
జిల్లా టిఆర్ఎస్ అధ్యక్షులు, ప్రభుత్వ విప్ బాల్క సుమన్ అన్నారు. మంచిర్యాల ఎమ్మెల్యే నడిపల్లి దివాకర్ రావు ఇంటిపై కాంగ్రెస్ నాయకులు దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని స్పష్టం చేశారు. ప్రజాప్రతినిధుల ఇళ్ల పై దాడి చేయడం మంచి సంస్కృతి కాదన్నారు. ఇలాంటి దాడులు చేయడం వల్ల ప్రజల్లో మెప్పును పొందలేరని స్పష్టం చేశారు. ప్రజల విశ్వాసాన్ని కూడగట్టలేరని సుమన్ వెల్లడించారు. ఇలాంటి దాడులు ప్రోత్సహించడం వల్ల ప్రజల్లో మరింత చులకన అవుతారని హెచ్చరించారు.