అల్లంను పరామర్శించిన మంత్రి కొప్పుల

తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ ఛైర్మన్ అల్లం నారాయణను సంక్షేమ శాఖ మంత్రి కొప్పులఈశ్వర్ పరామర్శించారు. నారాయణ సతీమణి పద్మ గత నెల 22వ తేదీన అనారోగ్యం కారణంగా మృతి చెందిన విషయం తెలిసిందే. మంత్రి కొప్పుల ఆదివారం సనత్ నగర్ లోని అల్లం నారాయణ నివాసానికి వెళ్లి పద్మ చిత్రపటానికి నివాళులు అర్పించి, ఆయనను పరామర్శించారు, ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.