హ్యాపీ ఫూల్స్ డే
అనసూయ పోస్ట్ పై నెట్టింట దుమారం
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా యాంకర్ అనసూయ పెట్టిన ఓ పోస్ట్ నెట్టింట రచ్చ చేస్తోంది. ”అంతర్జాతీయ మహిళా దినోత్సవం అనగానే ప్రతి ట్రోలర్, మీమర్ సడెన్‌గా మహిళలకు గౌరవమిస్తూ సందేశాలు పెట్టడం షురూ చేస్తారు. కాకపోతే అది 24 గంటల్లోనే ముగుస్తుంది. కాబట్టి అలాంటివి నమ్మకండి. హ్యాపీ ఫూల్స్ డే” అంటూ ట్విట్టర్‌లో ఓ పోస్ట్ పెట్టింది అనసూయ. దీంతో ఈ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. సోషల్ మీడియాలో యాక్టివ్ రోల్ పోషిస్తూ ట్రోల్స్ బారిన పడటం అనసూయకు కామన్. ఆమె డ్రెస్సింగ్ సెన్స్, బిహేవియర్ విషయమై చాలాసార్లు ట్రోల్స్‌కి గురైంది. అయితే తనపై వ్యతిరేకత వచ్చిన ప్రతిసారి తిరిగి కౌంటర్స్ వేసింది అనసూయ. ప్రస్తుతం బుల్లితెర, వెండితెరపై వరుస ఆఫర్స్‌తో దూసుకుపోతున్న ఈ ముద్దుగుమ్మ షూటింగ్ లొకేషన్స్‌లో బిజీ బిజీగా గడుపుతోంది.