టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ మహేందర్ పై బదిలీ వేటు
రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధి మంచిర్యాల టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ గా పని చేస్తున్న ఏ.మహేందర్ పై బదిలీ వేటు పడింది. ఆయనపై వివిధ రకాల ఆరోపణలు రావడంతో శాఖపరమైన చర్యలు తీసుకున్నారు. దీనిలో భాగంగా ఆయను నిర్మల్ జిల్లా వేకెన్సీ రిజర్వ్డ్(VR) కి అటాచ్ చేస్తూ అడిషనల్ డిజిపి నార్త్ జోన్ వై.నాగిరెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. కొద్ది రోజుల కిందట కోటపల్లి మండలం ఆలగామ వద్ద కోడిపందాలు ఆడుతున్న వ్యక్తులను పట్టుకున్నట్లు టాస్క్ ఫోర్స్ పోలీసులు వెల్లడించారు. అయితే వాస్తవానికి ఆ కోడిపందాలు మహారాష్ట్ర ప్రాంతంలో నిర్వహించారు. ఆడిన వారు ఇక్కడకు వస్తున్న సమయంలో ఇక్కడ పట్టుకున్నట్లు చూపించారని కోటపల్లి పోలీసులు ఆరోపించారు. కేసు నమోదు చేయడానికి చెన్నూరు సీఐ నిరాకరించారు. ఎట్టకేలకు ఉన్నతాధికారుల జోక్యంతో వివాదం సద్దుమనిగినా ఉన్నతాధికారులు దీనిపై విచారణ నిర్వహించారు. ఈ విషయంతో పాటు గతంలో కూడా ఆయనపై పలు ఆరోపణల నేపథ్యంలో టాస్క్ఫోర్స్ ఇన్స్పెక్టర్పై వేటు పడినట్లు సమాచారం.