ముఖ్యమంత్రి వీక్ గా ఉన్నారు
డాక్టర్ ఎంవీ రావు

రెండ్రోజులుగా సీఎం కేసీఆర్ వీక్ గా ఉన్నారని డాక్టరు ఎం వీ రావు స్పష్టం చేశారు. ఎడమ చేయి లాగుతున్నట్లు చెప్పారని ఆయన వెల్లడించారు. ప్రాథమిక పరీక్షల తర్వాత యాంజియోగ్రామ్ చేస్తామన్నారు. జనరల్ చెకప్ లో భాగంగా అన్ని పరీక్షలు నిర్వహిస్తామని వెల్లడించారు. సీఎం కేసీఆర్ ఆరోగ్యంగా ఉన్నారని చెప్పారు.సీఎం కేసీఆర్ స్వల్ప అస్వస్థతకు గురి కావడంతో హుటాహుటిస సీఎం కేసీఆర్ను సోమాజిగూడ యశోదా ఆసుపత్రికి తీసుకొచ్చారు. వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. అస్వస్థత కారణంగానే కేసీఆర్ యాదాద్రి పర్యటన రద్దు చేసుకున్నారు.