బాలిక చదువు ఈ దేశానికి అవసరం
కోరమాండల్ అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్ భాస్కర్ రెడ్డి
బాలికల చదువు దేశానికి ఎంతో అవసరమని కోరమాండల్ అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్ భాస్కర్ రెడ్డి అన్నారు. మంగళవారం కోరమాండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ సంస్థ ఆధ్వర్యంలో గ్రామీణ బాలికలు ప్రతిభా పురస్కారాలు అందించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ కోరమాండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ సంస్థ గ్రామీణ బాలికలు ప్రతిభా పురస్కార కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం రెండు తెలుగు రాష్ట్రాలలో నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ప్రతి జిల్లా నుంచి వందమంది జిల్లా పరిషత్ స్కూల్లో చదువుతున్న బాలికలను ఎంచుకుని వారికి ప్రతిభ ఆధారంగా ఆ స్కాలర్షిప్ ను ఇస్తామన్నారు. బాలికల చదువు రేపటి సమాజానికి ఎంతో ఉపయోగమన్నారు. బాలిక చదువును అందరూ ప్రోత్సహించాలన్నారు. ఇదే కంపెనీ ప్రధాన ఉద్దేశమన్నారు. ఖమ్మం జిల్లాలో వంద మంది బాలికలకు స్కాలర్షిప్లు అందజేశారు.ఈ కార్యక్రమంలో కంపెనీ జనరల్ మేనేజర్ సజన్ కుమార్, కంపెనీ జిల్లా మేనేజర్ అనిల్ కుమార్ రెడ్డి, సీనియర్ అగ్రానమిస్ట్ అన్న రామకృష్ణ, హెచ్ఆర్ మేనేజర్ సుధాకర్ శ్రీనివాస్, కంపెనీ అనలిస్ట్ కావ్య తదితరులు పాల్గొన్నారు ఈ పురస్కారాల్లో మొదట వచ్చిన అమ్మాయికి ఐదువేల రూపాయలు, రెండవ బహుమతి కింద మూడువేల ఐదువందల రూపాయలు అందచేశారు.