కారు బీభత్సం.. రెండేళ్ల చిన్నారి మృతి.. కారుకు ఎమ్మెల్యే స్టిక్కర్..
హైదారాబాద్ లో ఓ కారు బీభత్సం సృష్టించింది. గురువారం రాత్రి పది గంటల సమయంలో రోడ్డు దాటుతున్న ముగ్గురు మహిళలను ఢికొట్టింది. అయితే ఓ మహిళ చేతిలో ఉన్నరెండున్నర నెలల పాప మహిళ చేతిలో నుండి కింద పడడంతో తలకు గాయలై అక్కడికక్కడే మృతి చెందాడు. మరో వైపు ముగ్గురు మహిళలకు కూడా గాయాలయ్యాయి. గాయపడిన మహిళలతో పాటు చిన్నారి మృత దేహాన్ని జూబ్లీహిల్స్ అపోలో ఆసుపత్రికి చికిత్స కోసం తరలించారు. గాయపడిన మహిళలు మహారాష్ట్రకు చెందిన వారిగా గుర్తించారు. కాగా వారు నగరంలో యాచక వృత్తి చేసుకుంటున్నట్టు సమాచారం. మరోవైపు ప్రమాదానికి కారణమైన వ్యక్తి వెంటనే కారు అక్కడే వదిలి పారిపోయారు. కాగా ఆ కారుకు బోధన్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే షకీల్ పేరిట ఎమ్మెల్యే స్టిక్కర్ అతికించి ఉంది. ప్రమాదం చేసిన వారు ఆయన అనుచరులు లేదా బంధువులుగా పోలీసులు భావిస్తున్నారు.