తెలుగు ఛానళ్లలో NTv నంబర్ వన్
-రెండో స్థానంతో సరిపెట్టుకున్న టీవీ 9
-నెట్‌వర్క్ పరంగా మొదటి స్థానంలోనే
తెలుగు న్యూస్ ఛానళ్లలో ఎన్టీవీ మొదటి స్థానంలో నిలిచింది. చాలా కాలం విరామం తర్వాత బార్క్ టీవీ చానళ్ల రేటింగ్స్‌ను ప్రకటించింది. ఈ ఏడాది పదో వారం రేటింగ్స్ ను చూస్తే ఓవరాల్‌గా 77 పాయింట్లతో ఎన్టీవీ అగ్రస్థానంలో ఉంది. అర్బన్ , రూరల్ ప్రాంతాల్లోనూ ఎన్టీవీదే ఆధిపత్యం కనిపిస్తోంది. ఇక టీవీ 9 తన అగ్రస్థానాన్ని కోల్పోయింది. అది కూడా దరి దాపుల్లో లేదు. కేవలం యాభై ఐదు పాయింట్లు మాత్రమే టీవీ9 సాధించింది. అంటే మొదటి స్థానానికి మధ్య ఇరవై రెండు పాయింట్ల తేడా ఉంది.
మూడో స్థానంలో తెలంగాణ చానల్ వీ6 నిలిచింది. టీవీ 5, ఏబీఎన్ , సాక్షి, ఇతర టీవీ చానళ్లు 15 నుంచి ౩0 మధ్య రేటింగ్‌లు సాధిస్తూ ఉనికి నిలుపుకున్నాయి. టీవీ9 యాజమాన్యం రవిప్రకాష్ చేతుల నుంచి ఇతరులకు అప్పగించిన తర్వాత ఆ చానల్ ఇమేజ్ దారుణంగా పడిపోతూ వస్తోంది. న్యూస్ చానళ్ల రేటింగ్‌లు చాలా కాలంగాఇవ్వడం లేదు. తప్పుడు రేటింగ్‌ల కోసం చానళ్లు అక్రమాలకు పాల్పడినట్లుగా కేసులు నమోదయ్యాయి. ఈ కేసులో టీవీ 9 కూడా ఉంది.
అయితే టీవీ9 భారత్‌వర్ష్ దేశంలో అత్యధికంగా వీక్షించే జాతీయ హిందీ వార్తా ఛానెల్‌గా అవతరించింది. జాతీయ హిందీ వార్తా ఛానెళ్ల లిస్టులో 16.8 % మార్కెట్ వాటాతో అగ్రస్థానంలో నిలిచింది. 14.8% మార్కెట్ వాటాతో రెండవ స్థానంలో నిలిచిన ఆజ్‌తక్ నిలిచింది. హిందీలో 20 సంవత్సరాల కిందట ప్రారంభమైన ఆజ్‌తక్ అప్పటి నుంచి అగ్రగామిగా ఉంటూ వస్తోంది. టీవీ9 భారత్‌వర్ష్ తన మూడో వార్షికోత్సవంలోపే ఇంతటి అపూర్వమైన విజయం సాధించడం గమనార్హం. తెలుగు, కన్నడ, మరాఠీ, గుజరాతీ, బెంగాలీ భాషల్లో ఛానెల్స్‌ను నడుపుతున్న TV9 నెట్‌వర్క్.. దేశంలోనే అతిపెద్ద టెలివిజన్ న్యూస్ నెట్‌వర్క్‌గా తన ర్యాంక్ కాపాడుకుంది.