తెలంగాణ ఎంసెట్ తేదీలు ఖరారు.. పూర్తి వివరాలివే..

తెలంగాణ ఎంసెట్ పరీక్ష తేదీలను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రకటించారు. జూలై 14, 15, 18, 19, 20 తేదీల్లో ఎంసెట్ పరీక్షను నిర్వహించనున్నట్లు ప్రకటించారు. అలాగే ఈసెట్ పరీక్షను జూలై 18వ తేదీన నిర్వహిస్తామన్నారు. ఈ పరీక్షలను 28 రీజనల్ సెంటర్స్ పరిధిలోని 105 పరీక్ష కేంద్రాల్లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లతో నిర్వహిస్తామని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రకటించారు.