వంద శాతం వరి కొనాల్సిందే
-ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా తీర్మానాలకు నిర్ణయం -మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఆధ్వర్యంలో నేతల సమావేశం
మంచిర్యాల : కేంద్ర ప్రభుత్వం పంజాబ్ తరహాలో 100% తెలంగాణ వరి ధాన్యం కొనుగోలు చేయాలని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నేతలు డిమాండ్ చేశారు. మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఉమ్మడి ఆదిలాబాద్ టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు సమావేశమై పలు అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా పలువురు నేతలు మాట్లాడుతూ కేంద్రం మొండి వైఖరి వల్ల తెలంగాణ రైతులు పెద్ద ఎత్తున నష్టపోతారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పలు తీర్మానాలు చేయాలని నిర్ణయించారు. అందులో భాగంగా ఈ నెల 24న నియోజకవర్గ స్థాయిలో సన్నాహక సమావేశాలు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు.
25న గ్రామ పంచాయితీల్లో తీర్మానాలు చేస్తారు.
26న మండల పరిషత్ తీర్మానాలు చేయనున్నారు.
27 వ తేదీన జిల్లా, మండల రైతుబంధు సమితిల తీర్మానాలు చేస్తారు.
28న మార్కెట్ కమిటీలు, PACS కమిటీల తీర్మానాలు చేయనున్నారు.
29న DCCB, DCMS కమిటీల తీర్మానాలు చేస్తారు.
30 వ తేదీన జిల్లా పరిషత్ తీర్మానాలు, 31న అన్ని మున్సిపాలిటీల పాలకవర్గ తీర్మానాలు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ సమావేశంలో ప్రభుత్వ విప్ బాల్క సుమన్, ఎమ్మెల్సీ దండేవిట్ఠల్ ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.