ఫ్లాష్.. ఫ్లాష్.. ఏసీబీ వలలో ఎస్ఐ

నిన్న బదిలీ ఉత్తర్వులు తీసుకుని నేడు ఏసీబీ చిక్కాడో ఎస్ఐ. సూర్యపేట రూరల్ ఎస్ఐ లవకుమార్ లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కారు. సూర్యపేట జిల్లా కేంద్రంలోని రాజుగారితోట హోటల్ యజమాని నుంచి రూ. 1.30 లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీకి రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిపోయారు. బుధవారం ఆ ఎస్ఐ లవకుమార్‌కు సూర్యపేట రూరల్ నుంచి వీఆర్‌కు బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. బదిలీకి ముందే జేబులు నింపుకుందామని ప్రయత్నించి ఏసీబీకి అడ్డంగా దొరికిపోయారు.