చంపుతామ‌ని బెదిరిస్తున్నారు..

-సింగ‌రేణిలో ఓ మ‌హిళా ఉద్యోగిని ఆందోళ‌న
-ఆర్జీ 1 వ‌ర్క్‌షాప్ ఎదుట ధ‌ర్నా
-ఆందోళ‌న‌కు కార్మిక సంఘాల మ‌ద్ద‌తు

ఆర్జీ 1 ఏరియా వ‌ర్క్ షాప్ ఎదుట స్వ‌ప్న అనే బాధితురాలు ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. మహిళ ఉద్యోగులకు రక్షణలేదని,తన పై దాడి చేశారంటు ఆమె ఆవేద‌న వ్య‌క్తం చేశారు. వివ‌రాల్లోకి వెళితే.. పెద్దపల్లి జిల్లా రామగుండం ఏరియా వర్క్ షాప్ లో పనిచేస్తున్న అనే మహిళ ఉద్యోగిని టిబిజికెఎస్ నాయకుడు స్వామిదాస్ వేధింపులకు గురిచేస్తుండటంతో గత నెల పిబ్రవరి 24 న స్వామిదాస్ ను చెప్పుతో కొట్టింది. యాజమాన్యం స్వామిదాస్ ను సస్పెండ్ చేసింది. అతని పై విచార‌ణ నిర్వ‌హిస్తున్నారు. దీంతో ఈ విష‌యంలో రాజీ ప‌డాల‌ని స్వామిదాస్ అనుచరులు బెదిరింపులకు గురిచేస్తున్నారు. నిన్న రాత్రి శ్రీకాంత్ అనే వ్యక్తి స్వప్న పై దాడి చేసి కొట్టడంతో భయంతో స్వప్న గోదావరిఖని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. తనకు ప్రాణ భయం ఉందంటు, తాను పనిచేసే ఏరియా వర్క్ షాప్ ఎదుట ఆందోళనకు దిగారు.త‌న‌కు అండ‌గా ఉన్న వారిని, త‌న వైపు మాట్లాడుతున్న వారిని భ‌య‌బ్రాంతుల‌కు గురి చేస్తున్నార‌ని ఆమె క‌న్నీటి ప‌ర్యంత‌మ‌య్యారు. కార్మికులు విధులు బహిష్కరించి స్వప్నకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.

ఆందోళ‌న‌కు కార్మిక సంఘాల మ‌ద్ద‌తు..
ఆ మ‌హిళా ఉద్యోగిని ఆర్జీ 1 ఏరియా వ‌ర్క్ షాప్ ఎదుట ఆందోళ‌న చేస్తున్న విష‌యం తెలుసుకున్న మ‌హిళా సంఘాల నేతలు అక్క‌డికి చేరుకున్నారు. ఆమెతో పాటు గేటు ఎదుట బైఠాయించారు. ఈ మేర‌కు జీపు జాతా నిర్వ‌హిస్తున్న ఐఎన్‌టీయూసీ సెక్ర‌ట‌రీ జ‌న‌ర‌ల్ జ‌న‌క్‌ప్ర‌సాద్ సైతం ఆందోళ‌న‌కు మ‌ద్ద‌తు చెప్పారు. ఆ మ‌హిళ‌కు న్యాయం చేయాల‌ని డిమాండ్ చేశారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like