పిల్లలకు సరైన పోషణ అందించాలి

అంగన్‌వాడీకి వచ్చే పిల్లలకు సరైన పోషణ అందించాలని అంగన్‌వాడీ సూపర్‌వైజర్ మమత తెలిపారు. శుక్రవారం పోషణ పక్వాడ్ కార్యక్రమంలో భాగంగా కాంట్రాక్టర్ బస్తీలో 65 డిప్ ఏరియా అంగన్వాడీ సెంటర్లో తల్లులకు అవగాహన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి నెల తమ పిల్లల బరువులు చూసుకోవాలని కోరారు. ప్రతి నెల బరువు పెరుగుతున్నారా..? లేక తగ్గుతున్నారా.. చూసుకొని పిల్లలకు తగిన పోషణ అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు పద్మావతి, అనూరాధ ఆయా ధనలక్ష్మి తల్లులు, పిల్లలు పాల్గొన్నారు.