భారీ పెట్టుబడులతో ముగిసిన కేటీఆర్ పర్యటన

హైదరాబాద్: అమెరికాలో తెలంగాణ పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్ పర్యటన ముగిసింది. చివరి రోజు పలు సంస్థలతో సమావేశమైన కేటీఆర్.. భారీ పెట్టుబడులతో పర్యటనను ముగించారు. కేటీఆర్‌తో సమావేశం అనంతరం తెలంగాణలో భారీ పెట్టుబడులు పెట్టేందుకు లైఫ్ సైన్సెస్ సహా పలు ఫార్మా కంపెనీలు సంసిద్ధత వ్యక్తం చేశాయి. ₹1,750కోట్ల పెట్టుబడులపై రెండు ప్రముఖ సంస్థలు ప్రకటన విడుదల చేయగా.. స్లే బ్యాక్ ఫార్మా కంపెనీ మరో ₹150 కోట్లు పెట్టుబడి పెడుతున్నట్లు వెల్లడించింది. గడిచిన ఐదు సంవత్సరాల్లో హైదరాబాద్ ఫార్మాలో ₹2300 కోట్ల పెట్టుబడులను స్లే బ్యాక్ పెట్టింది.