ఢిల్లీకి ముఖ్యమంత్రి KCR

ముఖ్యమంత్రి కేసీఆర్ వైద్యం కోసం ఢిల్లీకి వెళ్లనున్నారు. 10:30 ఢిల్లీకి బయల్దేరతారు. బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో దేశ రాజధానికి వెళ్లనున్నారు. పంటినొప్పి తీవ్రం కావడంతో వైద్యం కోసం ఢిల్లీ వెళ్తున్నారు. కొన్నాళ్లుగా కేసీఆర్ ఢిల్లీలోని ఏయిమ్స్ ట్రీట్మెంట్ చేయించుకుంటున్నారు. ఇటీవల సతీమణి శోభతో కలిసి ఢిల్లీకి వెళ్లినప్పుడు కూడా చికిత్స తీసుకున్నారు. వైద్యపరీక్షల అనంతరం ధాన్యం కొనుగోళ్లపై కేంద్రమంత్రితో పాటు అవసరమైతే ప్రధాని మోదీని కేసీఆర్ కలిసే అవకాశముంది.