వడదెబ్బతో ఇద్దరి మృతి
గతంలో ఎప్పుడు లేని విధంగా ఉష్ణోగ్రతలు నమోదు అవుతుండటంతో వడదెబ్బ బాధితులు పెరుగుతున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వడదెబ్బతో ఇద్దరు మృతి చెందారు.
జైనథ్ మండల కేంద్రానికి చెందిన విఠల్ వడదెబ్బతో మృతి చెందారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి రడగండాల బస్తీ కి చెందిన సంపత్ అనే టెక్నికల్ అసిస్టెంట్ సైతం వడదెబ్బకు బలయ్యారు.
కాగా, రాష్ట్రంలోనే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో ఆదిలాబాద్ జిల్లా చెప్రాల లో 43.8 డిగ్రీలు, ఆదిలాబాద్ అర్బన్ లో 43.7 డిగ్రీలు, జైనథ్ లో 43.6 డిగ్రీలు నమోదయ్యాయి. కొమురం భీం జిల్లా కెరమెరి లో43.8 డిగ్రీలు, కౌటాల లో 43.3 డిగ్రీలు, నిర్మల్ జిల్లా లింగా పూర్ లో 43.3 గా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి