కట్టెల మోపుతో ఎమ్యెల్యే నిరసన
పెరిగిన గ్యాస్ పెట్రోల్, డీజిల్, ధరలను నిరసిస్తూ ఉమ్మడి ఆదిలాబాద్లో పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో నిరసనలో ఎమ్యెల్యే జోగు రామన్న పాల్గొన్నారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుండి జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు కట్టెలమోపు తలపై మోస్తూ ఖాళీ సిలిండర్లను ప్రదర్శిస్తూ నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం మెడలు వంచైనా సరే తెలంగాణ రైతాంగానికి అండగా ఉంటామన్నారు. పెట్రోల్డీజిల్ గ్యాస్ ధరలు పెంచుతూ కార్పొరేటర్లకు న్యాయం చేసేందుకు సామాన్యుడికి అన్యాయం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ రైతాంగం పండించిన ధాన్యాన్ని కేంద్రం తో కొనుగోలు చేయిస్తామని గతంలో చెప్పిన బిజెపి నాయకులు మాట మీద నిలబడాలని డిమాండ్ చేశారు. పీయూష్ గోయల్ తెలంగాణ రైతులను అవమానించడం సరికాదన్నారు. వెంటనే తెలంగాణ రైతాంగానికి క్షమాపణ చెప్పాలని ఎమ్మెల్యే జోగు రామన్న డిమాండ్ చేశారు. కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ భోజ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్. వైస్ చైర్మన్ జెయిర్ రంజాని. ఫ్లోర్ లీడర్ బండారి సతీష్, పట్టణ అధ్యక్ష కార్యదర్శులు అజయ్, అశ్రాఫ్, మహిళ అధ్యక్ష కార్యదర్శులు స్వరూపరాణి, బోడగం మమత, కౌన్సిలర్లు. లక్ష్మణ్. వెంకన్న.శ్రీనివాస్. కొండ గణేష్. హైమద్, ప్రశాంత్, సాయి తదితరులు పాల్గొన్నారు.