సింగ‌రేణి మ‌నుగ‌డ కోసం పోరాటం

BMS ఆధ్వ‌ర్యంలో వారం రోజుల పాటు పోరాటాలు

సింగ‌రేణి మ‌నుగ‌డ కోసం పోరాటం చేస్తామ‌ని, కార్మికుల హ‌క్కుల ప‌రిర‌క్ష‌ణ‌కు ఈ పోరుబాట ప‌ట్టిన‌ట్లు భార‌తీయ మ‌జ్దూర్ సంఘ్ ఉపాధ్య‌క్షుడు అప్పాని శ్రీనివాస్ స్ప‌ష్టం చేశారు. భూపాల‌ప‌ల్లిలో సింగరేణి కోల్ మైన్స్ కార్మిక సంఘ్ (BMS) బ్రాంచి కమిటీ, పిట్ కమిటీ, షిఫ్ట్ ఇంఛార్జీల ముఖ్య కార్యకర్తల సమావేశానికి హాజ‌ర‌య్యారు. కార్మికుల చెమట చుక్కలతో… వారి ప్రాణత్యాగాలతో నష్టాల సింగరేణిని లాభాల బాట‌లోకి వ‌చ్చింద‌న్నారు. ఎంతో క‌ష్ట‌ప‌డి సింగ‌రేణి సంస్థ గురించి కృషి చేస్తో్ంటే భ‌విష్య‌త్తులో సంస్థ ఉనికి లేకుండా చేసే ప్ర‌య‌త్నాలు సాగుతున్నాయ‌ని ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. సింగరేణి సంస్థ యాజమాన్యం, ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల సంస్థ మ‌నుగ‌డే ప్ర‌శ్నార్థ‌కంగా మారింద‌న్నారు. న్యాయంగా సింగరేణికి రావాల్సిన మొండి బకాయిలు సుమారుగా రూ. 25,000 కోట్ల రూపాయలు వెంటనే తిరిగి చెల్లించాల‌ని డిమాండ్ చేశారు. జెన్‌కో, ట్రాన్స్‌కో, రాష్ట్ర ప్రబుత్వం సింగరేణికి తిరిగి డబ్భులు చెల్లించి సింగరేణి సంస్థను, కార్మికుల భ‌విష్య‌త్తును కాపాడాలని BMS డిమాండ్ చేస్తున్నదన్నారు.

ఈ బ‌కాయిలు వ‌స్తే వాటిని మొత్తంగా బ్యాంకుల్లో డిపాజిట్ చేస్తే సింగరేణికి వడ్డీ రూపంలో సంవత్సరానికి రూ. 2000 కోట్ల ఆదాయం వస్తుందని తెలిపారు. కొత్త‌గా 45 బొగ్గు గనులు తెరవచ్చ‌ని, లేక‌పోతే 45 బొగ్గు బ్లాకులను వేలం ద్వారా సాధించుకునే అవ‌కాశం ఉంటుంద‌ని వెల్ల‌డించారు. బొగ్గు బ్లాకుల కేటాయింపు వంటి ముఖ్యమైన అంశాల్లో రాజకీయాలు చేయవద్దని బీఎంఎస్‌ మొదటి నుండి యాజమాన్య ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తోందని ఆయ‌న గుర్తు చేశారు. బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, భూపాల‌ప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గ ఇన్‌చార్జి చందుపట్ల కీర్తిరెడ్డి మాట్లాడుతూ సింగరేణి కార్మిక సమస్యల పరిష్కారం కోసం BMS చేసే కార్మిక పోరాటాలకు BJP మద్దతు ఉంటుంద‌ని వెల్ల‌డించారు. దీంతో పాటు కార్మిక సమస్యల పరిష్కారానికి కృషి చేస్తుందని హామీ ఇచ్చారు. సింగరేణి గుర్తింపు ఎన్నికల వేళ ముఖ్యమంత్రి కేసీఆర్ కార్మికులకు ఇచ్చిన హామీల అమలు కోసం BMS చేసే పోరాటం లో స్వయంగా పాల్గొంటామని హామీ ఇచ్చారు. ఈ సంద‌ర్భంగా ప‌లు డిమాండ్ల‌ను యాజమాన్యం ముందుంచారు.

ఇవి డిమాండ్స్‌..

1. సింగరేణిలో ఓపెన్ కాస్ట్,అండర్ గ్రౌండ్లలో బొగ్గు ఉత్పత్తి చేసే పనిని ప్రైవేటు కాంట్రాక్టువారికి ఇవ్వొద్దు.
2. సింగరేణిలో జరిగిన ప్రమాదాల్లో మృతి చెందిన కార్మికులు, కాంట్రాక్ట్ కార్మికులకు ప్రతి కుటుంబాలకు కోటి రూపాయల నష్టపరిహారం చెల్లించాలి.
3. మైనింగ్ స్టాఫ్‌, ట్రేడ్స్ మెన్ అనారోగ్యంతో అన్ ఫిట్ ఐతే సర్పెస్ లో సుటేబుల్ జాబ్ సేమ్ గా ఇవ్వాలి.
4. కోల్ ఇండియా మాదిరిగా సింగరేణిలో కుడాకాంట్రాక్టు కార్మికులకు హైపవర్ కమిటీ వేతనాలు చెల్లించాలి,
5. సింగరేణి కార్మికులకు సొంత ఇంటి పథకం తో పాటు జిల్లా కేంద్రాలలో 250 గజాల స్థలంతో పాటు రూ. 50 లక్షల వడ్డీలేని ఋణ సదుపాయం కల్పించాలి.
6. కార్మికుల మారు పేర్లను సొంత‌ పేర్లు గా మార్చాలి.
7. కార్మికులకు సింగరేణి వ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న వారసుల ఉద్యోగాలను వెంటనే పరిష్కరించాలి.
8. డిపెండెంట్ కార్మికుల పిల్లల వయోపరిమితిని 35 నుండి 40 సంవత్సరాలకు పెంచాలి.
9. కోల్ ఇండియాలో చెల్లిస్తున్నట్లుగా పేర్క్స్/అలవెన్సు పై ఆదాయ పన్ను తిరిగి కార్మికులకు రియంబర్స్ మెంట్ చేయాలి.
10. కార్మికుల పేర్లలో తప్పులను వెంటనే సరిచేసి అవినీతికి తావులేకుండా వారసులకు ఉద్యోగం కల్పించాలి.
11. భూపాలపల్లి ఏరియాలో నూతనంగా నిర్మిస్తున్న క్వార్టర్స్ ను బెష్మేంట్ పై అలాట్ చేయాలి.

ఏరియాలో ఆందోళన…నిరసన.. కార్యక్రమాలు
తేది 07.04.2022. ఏరియా గనులు, డిపార్ట్ మెంట్ లలో నల్లబ్యాడ్జీలతో నిరసన…
తేది 08.04.2022. ktk 1 ఇంక్లైన్ లో నిరసన, విన‌తిప‌త్రం స‌మ‌ర్ప‌ణ‌..
తేది 09.04.2022. ktk 5 ఇంక్లైన్ లో నిరసన, విన‌తిప‌త్రం స‌మ‌ర్ప‌ణ‌..
తేది 11.04.2022 ktk 6 ఇంక్లైన్, సెక్యూరిటీ డిపార్ట్మెంట్ లో నిరసన, విన‌తిప‌త్రం స‌మ‌ర్ప‌ణ‌..
తేది 12.04.2022 ktk లాంగ్ వాల్ ప్రాజెక్టు, oc౩, ఏరియా హాస్పటల్ లో నిరసన, విన‌తిప‌త్రం స‌మ‌ర్ప‌ణ‌..
తేది 13. 04.2022 ktk oc 2, ఏరియా వర్క్ షాప్ లో నిరసన, విన‌తిప‌త్రం స‌మ‌ర్ప‌ణ‌..

సమావేశంలో కేంద్ర క‌మిటీ నాయ‌కులు ఎం.మనోజ్ కుమార్, నాయకులు వీ. సుజేందర్, రేనుకుంట్ల మల్లేష్, పాండ్రాల మల్లేష్, బోయిన వెంకట స్వామి,ఈర్ల సదానందం, గట్ల మల్లారెడ్డి, బత్తుల స్వామి, అల్లం శ్రీనివాస్, బ్రాంచి నాయకులు ఒరం లక్ష్మణ్, పని రమేష్, ఎండీ యూసుఫ్, ఎం.దామోదర్ రావు, ఈదుల శ్రీనివాస్, ఫిట్‌ కమిటీ కార్యదర్శులతోపాటు రఘుపతి రెడ్డి, తాండ్ర మొగిలి, డి.నారాయణ, శివనారాయణ, అన్నం శ్రీనివాస్ కార్యకర్తలు పాల్గొన్నారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like