అంబేద్కర్ యువజన సంఘం కమిటీ ఎన్నిక
అంబేద్కర్ 131 జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు అంబేద్కర్ యువజన సంఘం కమిటీ ఎన్నుకున్నారు. తాండూరు మండలం మాదారం టౌన్షిప్ కమిటీ ఏర్పాటు చేసినట్లు వారు వెల్లడించారు. ఈ కమిటీ అధ్యక్షుడిగా దుర్గం అశోక్ కుమార్, ప్రధాన కార్యదర్శిగా దుర్గం ప్రవీణ్‌కుమార్, ఉపాధ్యక్షులుగా సముద్రాల ఆనంద్, కోడెం సంతోష్, ఆర్గనైజింగ్ సెక్రటరీగా పత్తి వెంకటస్వామి, కోశాధికారిగా పంద్రం క్రాంతికుమార్, సహాయ కార్యదర్శులుగా గట్టులక్ష్మణ్,కుష్నపల్లిలక్ష్మణ్,సభ్యులుగా ఆకుదారి క్రాంతికుమార్,గుండేటి కమలాకర్,జూపాక మొండి,చజనాల రాహుల్,పంద్రం ధృవకుమార్,గట్టు అశోక్‌కుమార్, బేత్ రాజేందర్ కుమార్,దుర్గం నిర్వాణ్‌ను ఎంపిక చేశారు. ఈ కమిటీకి శాశ్వత గౌరవ సభ్యులుగా దుర్గం సంపత్, ముడిమడుగుల రాజారాంచందర్, ఈ కమిటీ సలహాదారులుగా జులుగూరి చంద్రయ్య, గోనె తిరుపతిని ఎన్నుకున్నట్లు అధ్యక్షుడు అశోక్‌కుమార్ వెల్లడించారు. అంబేద్కర్ పుట్టిన రోజు వేడుకలు ఘనంగా నిర్వహించేలా ప్రణాళికలు రూపొందించామన్నారు. ఆ వేడుకల్లో ప్రజలందరూ భాగస్వామ్యులు అయ్యేలా ముందుకు వెళ్తామని వెల్లడించారు.